ప్రకాశం: మార్కాపురంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్ల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ సునీత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.