HYD: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు ప్రారంభించింది. ఆరు ప్రధాన జంక్షన్లలో స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులు నిర్మాణానికి సిద్ధమవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా 320కుపైగా ఆస్తులకు నోటీసులు జారీ చేసి, టీడీఆర్, నష్టపరిహారంపై అభిప్రాయాలు కోరుతోంది.