హీరోయిన్ రుక్మిణీ వసంత్ బికినీతో స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. అవి డీప్ ఫేక్ వీడియోలని స్పష్టం చేసింది. ఇలాంటి కంటెంట్ రూపొందించి, వైరల్ చేయడం ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఈ వీడియో, ఫొటోలను పోస్టు చేసి, వైరల్ చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.