MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు గైడ్ గోరంట్ల విజయ్ ఆలయ చరిత్ర విశేషాలను వివరించారు. అనంతరం భక్తులు రామప్ప చెరువులో బోటింగ్ చేస్తూ సందడి చేశారు.