KKD: ‘మన స్మార్ట్ సిటీని మనమే తీర్చిదిద్దుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని’ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్, MLA కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు.