RR: వనస్థలిపురంలో RR అర్బన్ జిల్లా BJP కార్యవర్గ సభ్యులు, ముఖ్యనాయకుల సమావేశం BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నిర్వహించారు. అందరి సమిష్టి కృషితో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, ‘సంగఠన్’ను బలోపేతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజాబాహుళ్యంలోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.