NDL: కడపలోని డా. వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ, 9వ తరగతుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు జూన్ 2లోపు apsportsschool.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం.ఎన్.వి. తెలిపారు. జూన్ 3 నుంచి 5 వరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు.