HYD: సుల్తాన్ బజార్ పోలీసులు క్యాష్-ఇన్-ట్రాన్సిట్ ఏటీఎం చోరీ కేసును 48 గంటల్లో ఛేదించి, నిందితుడు షేక్ రహ్మాన్‌ను కర్ణాటకలోని గుల్బర్గా వద్ద అరెస్ట్ చేశారు. బ్యాంకులో జమ చేయాల్సిన నగదు వాహనాన్ని తీసుకెళ్లి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.9.53 లక్షల నగదు, మొబైల్, బ్యాగ్, వాహన తాళాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.