CTR: జీడి నెల్లూరు సీడీపీవో పద్మ సునంద అంగన్వాడీ కార్యకర్తలను యూనియన్ పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని శనివారం హెచ్చరించారు. పదేళ్లుగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, ప్రస్తుతం కొందరు యూనియన్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చాయని, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.