JN: బచ్చన్నపేట మండలంలో 18 ఏళ్ల యువతిని రూ.20 లక్షలకు అమ్మి, ఇష్టం లేని పెళ్లి బలవంతంగా జరిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి కక్కెర్ల రాకేశ్ గౌడ్, సవతి తల్లి రేణుక, అలాగే వివాహం చేసుకున్న ఆవుల ప్రశాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ భీం శర్మ తెలిపారు.