PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం అభివృద్ధిపై చర్చిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై గ్రామస్థులతో చర్చించారు. దేవస్థానం అభివృద్ధికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.