అన్నమయ్య: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్యాంప్ శనివారంతో ఘనంగా ముగిసింది. మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది యోగా,ప్రాణాయామం,ధ్యాన సాధనలో పాల్గొన్నారు. వృత్తిపరమైన ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత,శారీరక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.