MDK: చేగుంట మండలం రెడ్డిపల్లిలో బాలింతలు అయిన వదిన మరదలు స్వాతి (26), సౌందర్య (27) అనారోగ్యంతో మృతి చెందారు. రమేష్ భార్య స్వాతి తల్లి ఊరైన చందంపేటలో అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించగా రాత్రి మృతి చెందింది. రమేష్ సోదరి సౌందర్య శనివారం అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. నెలలోపు చిన్నారులు ఉండగా, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.