MDCL: ఉప్పల్లో జీహెచ్ఎంసీ పరిపాలనా విస్తరణతో అధికారుల రద్దీ పెరిగింది. జోనల్, సర్కిల్ స్థాయి విభాగాలు ఒకే భవనంలో కొనసాగుతుండటంతో ఛాంబర్లు, పార్కింగ్ సమస్యలు తీవ్రంగా మారాయి. మున్సిపాలిటీ కాలంలో నిర్మించిన భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన సిబ్బందికి అనుగుణంగా కొత్త సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.