ATP: అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో వివిధ విభాగాల పోలీసు సిబ్బందికి యోగా, ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో హార్ట్ ఫుల్నెస్ ట్రైనర్లు గాయత్రి, లక్ష్మి సిబ్బందికి ఆసనాలు, ప్రాణాయామం నేర్పించారు. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే పోలీసులకు మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం చేకూర్చడమే దీని లక్ష్యమని డాక్టర్ గోపీనాథ్ తెలిపారు.