TG: HYD మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తు తెలియని దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వక్ఫ్‌బోర్డు తరఫున పలు కీలక కేసులు వాదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.