RR: షాద్నగర్ పట్టణ కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి సమయంలో ఏటీఎం అద్దాలను ధ్వంసం చేస్తుండగా, ఓ యువకుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.