ప్రతి దానీకీ భయపడే లక్షణం ఉంటే దాని నుంచి వేగంగా బయటపడాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సూచించాడు. మన క్యారెక్టర్ ఎలా ఉన్నా, అది ఒరిజినల్‌గా ఉంటే చాలని ‘పూరి మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో చెప్పాడు. రైట్ యాటిట్యూడ్ ఉన్నవారిని ఎవరూ ఓడించలేరని, ఎందుకంటే వారు జీవితానికి ఎదురెళ్లకుండా లైఫ్ అనే నదిలో ఒదిగిపోతూ కొట్టుకుపోతుంటారని.. అందుకే అలాంటి వారిని ఎవరూ ఏమీ చేయలేరన్నాడు.