W.G: ఆకివీడు ప్రాంతంలో నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న మట్టి ట్రాక్టర్లపై రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టింది. శనివారం మూడు మట్టి ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి అతివేగంగా నడపడమే కాకుండా, మట్టిపై ఎటువంటి బరకాలు ఏర్పాటు చేయకుండా తిరుగుతుండడంతో కేసులు నమోదు చేశారు.