ELR: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న శ్రీవారి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చేందుకు ఎక్కడికి అక్కడ మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కేశఖండనశాల, ప్రసాదాల వితరణ కేంద్రాల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా పలు చర్యలను అధికారులు ఏర్పాటు చేశారు.