W.G: ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు కడప నగరపాలక సంస్థలో శనివారం ఉదయం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కమిషనర్ సి. హెచ్. భావన ప్రారంభించారు. మాసాపేట 26వ డివిజన్లో వీధులు, కాలువలు శుభ్రపరిచి బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూచించారు.