AKP: నాతవరం మోడల్ ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఉపాధి హామీ శ్రామికులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతున్నాయన్నారు.