NLG: నకిరేకల్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు ఏరియా ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి ప్రాంతీయ అభివద్దికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.