ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకోనున్నారు. జిల్లాలో పలు అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం చింతకాని, మధిర నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం వెల్లడించింది.