ASR: అరకులోయలో గ్యాస్ సిలిండర్ కోసం తీవ్రమైన ఎండలో సమయానికి గ్యాస్ బండి రాక వినియోగ దారులు పడిగాపులు కాస్తున్నారు. స్థానికంగా భారత్ గ్యాస్ ఏజెన్సీ లేక ఎస్.కోట మాడుగుల ఏజెన్సీలపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అరకులోయ వైస్ ఎంపీపీ రామన్న గ్యాస్ కొరత లేకుండా అధికారులు చూడాలన్నారు. అరకులో గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.