NDL: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నంద్యాల టీడీపీ సీనియర్ నేత చర్చిల్ కుటుంబానికి పార్టీ తరఫున శనివారం రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి ఫరూక్ అందజేశారు. 33వ వార్డు ఇంఛార్జ్ జోసెఫ్ చొరవతో మంత్రి భీమా చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. యువనేత ఫిరోజ్, ఫయాజ్ పాల్గొన్నారు.