PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 GM లలిత్ కుమార్ అధికారులతో కలిసి సింగరేణి క్వార్టర్లలో కనీస సదుపాయాలను శనివారం పరిశీలించారు. GDK బస్టాండ్ కాలనీలోని సంస్థ నివాసాల మధ్య ఉన్న పారిశుద్ధ్యం, డ్రైనేజీలను పరిశీలించారు. కార్మిక కుటుంబాలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలన్నారు.