W.G: చింతలపూడి పట్టణంలో నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. కార్మికులతో కలిసి ఆయన చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచారు. రోడ్డుపై ఉన్న చెత్తను డస్ట్బిన్లలో వేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతోనే మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.