KDP: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కడప నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ భావన ఘనంగా ప్రారంభించారు. మాసాపేట 26వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో రహదారులు, కాలువలు, చెత్త కేంద్రాల శుభ్రతతో పాటు ఫాగింగ్, బ్లీచింగ్ పనులు చేపట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని కమిషనర్ సూచించారు.