AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు కోసం శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవోలు సీహెచ్. తలుపులు, జీవీఎస్. నాగేంద్ర, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాల గురించి వివరించారు. కావున పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.