పెద్దపల్లి జిల్లాలో తీవ్ర ఎండలు, వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ కే.ప్రమోద్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు రావద్దని, తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి వైద్య సహాయం పొందాలన్నారు.