ATP: తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి శనివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారికి మామిడి పండ్లతో విశేష అలంకరణ చేశారు. వేసవి కాలం పురస్కరించుకుని లోక కల్యాణార్థం అర్చకులు ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వినూత్న అలంకరణను తిలకించడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి స్థానిక భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.