VSP: డ్రైనేజీలు, చెత్తాచెదారం తొలగించే లక్ష్యంతో ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని MLA వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పూర్ణా మార్కెట్ వద్ద శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు స్థానికులు తమ బాధ్యతగా డ్రైనేజీలు శుభ్రం చేసుకుంటూ చెత్తాచెదారం జీవీఎంసీ వాహనాలకు అందజేయాలని ఎమ్మెల్యే కోరారు.