కామారెడ్డిలో నిన్న రాత్రి 46వ వార్డులో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హిందువులలో ఐక్యత కోసం హిందూ సమ్మేళనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.