PPM: పార్వతీపురం పట్టణంలోనిలయన్స్ కల్యాణ మండపంలో పలువురికి కళ్లద్దాలు శనివారం పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆర్థిక సహకారంతో సమకూర్చిన కళ్లద్దాలను జిల్లా నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో 20 మందికి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రొగ్రాం మేనేజర్ డాక్టర్ సూర్యకౌశిక్ పాల్గొన్నారు.