కడపలోని ఒరా స్కిన్ క్లినిక్‌లో ఈ నెల 24న ఉచిత చర్మవ్యాధుల వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డా. యామిని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న క్లినిక్‌లో ఉదయం 10 గంటల నుంచి శిబిరం ప్రారంభం కానుంది. జుట్టు, చర్మం సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించనున్నట్లు పేర్కొన్నారు. సోరియాసిస్, మొటిమలు, చుండ్రు వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నారు.