ATP: తాడిపత్రి పట్టణంలో ఇవాళ మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, షాపుల యజమానులకు దండం పెట్టి మరి చెత్త ఎత్తివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న ప్రతి షాపు ముందర యజమానులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడిపత్రి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.