GNTR: గుంటూరు నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో మారు పెరిగాయి. నిన్నటి వరకు రూ.113 ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈ రోజు రూపాయి పెరగడంతో రూ.114కి చేరింది. అలాగే నిన్న లీటర్ రూ.101గా ఉన్న డీజిల్ ధర కూడా రూపాయి పెరిగి నేడు రూ.102కి పెరిగింది. రోజు రోజుకూ మారుతున్న ఈ ధరల పెంపుతో బంకులకు వస్తున్న వాహనదారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.