NZB: నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన మగ్గరి మాధవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతోంది. ఆమె వైద్య ఖర్చుల కోసం గ్రామానికి చెందిన కోనేరు ప్రసాద్ తన బీటెక్ మిత్రులకు విషయం తెలిపాడు. స్పందించిన స్నేహితులు కలిసి రూ.76 వేల నగదును సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మాధవి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.