NGKL: అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టరేట్లో నిర్వహించిన బడిబాట సమీక్ష కార్యక్రమానికి ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఆగ్రహించిన కలెక్టర్ ఎంఈవోపై చర్యలకు డీఈవోను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఎంఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.