NTR: నల్లకుంట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్‌కు హోటల్ సూచిక బోర్డు అమర్చడం చర్చనీయాంశంగా మారింది. సిగ్నల్ పోల్‌పై “ఓ హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్” పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థపై వ్యాపార ప్రకటనలు ఉండటం సరైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.