W.G: నరసాపురం సుందరంగా మార్చే లక్ష్యంతో నరసాపురంలో శనివారం క్వీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పెద్దిరాజు స్వయంగా పాల్గొన్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, చేత చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు.