AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. 200 మండలాల్లో 44 డిగ్రీలు, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న పల్నాడులో అత్యధికంగా 48 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.