ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ‘వజ్రప్రహర్’ మెగా కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనిలో భాగంగా 3 టౌన్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ యాదవ్ నగర్లో తనిఖీలు నిర్వహించారు. 200 ఇళ్లను తనిఖీ చేసి ప్రజలతో సమావేశం అయ్యారు. అలాగే 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ అరెస్ట్ 1, ఇద్దరు పాత నేరస్తులను గుర్తించారు.