MDCL: ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలో నిజం కానుంది. మల్లాపూర్లో సర్వే నంబర్ 84లో 36 గుంటల స్థలంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. రూ.37 కోట్ల వ్యయంతో మూడంతస్తుల భవనం, డబుల్ సెల్లార్ పార్కింగ్తో ఆధునిక సదుపాయాల ఆసుపత్రి నిర్మించనున్నారు.