RR: షాద్నగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోర్టు ఆవరణలో చేపడుతున్న అభివృద్ధి పనులతో న్యాయవాదులు, ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.