MBNR: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన పొదలు, రాతి ప్రాంతాలు అరుదైన నక్షత్ర తాబేళ్ల సహజ ఆవాసాలుగా నిలుస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతి తాబేళ్లు పూర్తిగా అడవిలోని గడ్డి, ఆకులను తింటూ పర్యావరణాన్ని కాపాడుతుంటాయి. పెంకుపై నక్షత్రాల గుర్తులతో ఆకట్టుకునే ఈ అరుదైన శాకాహార జీవులు అంతరించిపోయే దశలో ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది.