ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ రీజియన్ పరిధిలో 4428 కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 391 టీచర్లు, 1415 హెల్పర్ల పోస్టులు భర్తీ కాలేదు. హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో ఖాళీలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.