WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో శనివారం రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, వ్యవసాయ అధికారి అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. రైతులు ఆధార్ కార్డు,పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌తో విత్తనాలు పొందాలని సూచించారు. 30 కిలోల బ్యాగుపై ప్రభుత్వం 50శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు.