KKD: సామర్లకోట పట్టణ పరిధి గాంధీనగర్ లారీ స్టాండ్ రోడ్డు వద్ద తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. యజమాని కొల్లూరి సరస్వతి రాజమండ్రిలో వివాహానికి వెళ్లడంతో రాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. శనివారం చోరీ ఘటనకు సంబంధించి సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.